ప్రజాశక్తి-వేంపల్లె : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలను టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. రెండు చోట్ల వేరు వేరుగా టిడిపి నేతలు లోకేష్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టిన రోజు సందర్భంగా వేంపల్లెలోని గండి రోడ్డులోని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు ఆర్ వి రమేష్, మాజీ ఎంపిటిసి జివి రమణ ఆధ్వర్యంలో టిడిపి నేతల సమక్షంలో పెద్ద కేక్ ను కట్ చేసి సంబరాలు చేపట్టారు. అలాగే టిడిపి కార్యకర్తలకు, అభిమానులకు ఎమ్మెల్సీ కార్యాలయంలో అల్ఫాహరం ఏర్పాటు చేశారు. అలాగే పులివెందుల రోడ్డులోని టిడిపి కార్యాలయంలో టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఆర్ వి రమేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలను పొందిన నాయకుడు మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కొంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. పులివెందుల నియోజకవర్గంలో కూడ టిడిపి బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు టిడిపి మండల కన్వీనర్ రామమునిరెడ్డి, ఎస్పీ జయచంద్రారెడ్డి, డివి సుబ్బారెడ్డి, మల్లంగి గోపాల్ రెడ్డి, మల్లంగి భాస్కర్ రెడ్డి, ప్రకాష్, ఏమిరెడ్డి కృష్ణారెడ్డి, ఇడుపులపాయ పోతిరెడ్డి శివ, కావలి భాను కిరణ్, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహమ్మద్ షబ్బీర్ తో పాటు పలువురు టిడిపి నేతలు పాల్గొన్నారు.
